క్రికెటైనా, సినిమా, సంగీతం ఏదైనాసరే...వారు మాత్రం వద్దే వద్దు!: గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

  • సైనికులను చంపుతుంటే పాక్ తో శాంతి చర్చలేంటి?
  • అన్ని రంగాల్లో పాక్ ను నిషేధించండి
  • పాకిస్థానీయులను కాలు పెట్టనీయవద్దు: గంభీర్
సరిహద్దుల్లో పాకిస్థాన్ వారు భారత సైనికులను చంపుతూ ఉంటే, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని, పాకిస్థానీయులను ఇండియాలో కాలు పెట్టకుండా నిషేధం విధించాలని టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, క్రికెట్ తో పాటు సినిమాలు, సంగీతం తదితర అన్ని రంగాల్లోనూ పాక్, ఇండియాల మధ్య సంబంధాలు వద్దని సూచించాడు. పరిస్థితులు కొలిక్కి వచ్చి, పాక్ కు బుద్ధి వచ్చేంత వరకూ వారిని ఇండియాలోకి రానీయకపోవడమే మంచిదని అన్నాడు.

గత సంవత్సరం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరమరణం పొందిన సైనికుల పిల్లల విద్యకు అవసరమయ్యే ఖర్చును సాయంగా అందించిన గంభీర్, గత రాత్రి వారితో కలసి డిన్నర్ చేశాడు. పాక్ రేంజర్లను సైన్యం చంపడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డ గంభీర్, సహనానికి కూడా హద్దు ఉంటుందని, శాంతి చర్చలని ఓ వైపు చెబుతూ, మరోవైపు సరిహద్దుల్లో దాష్టీకానికి దిగుతున్న పాక్ కు బుద్ధి చెప్పాలని అన్నాడు. ఈ అంశంలో రాజకీయాలకు తావివ్వరాదని సూచించాడు.
Go Back to Shorts
India
Pakistan
Gautam Gambhir

More Telugu News